కరోనా కష్టకాలంలో కూడా విశ్వ వ్యాప్తంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న నర్సులందరికీ #అంతర్జాతీయ_నర్సుల_దినోత్సవం #InternationalNursesDay
నర్సులు నిజంగానే సేవాముర్తులు.. చికిత్స చేయండి అని చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్ళేవరకు వెన్నంటే ఉండి సేవలు చేస్తారు. అనుక్షణం నర్స్.. సిస్టర్ అంటూ పిలిచినా విసుగు చెందకుండ వస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు అటు డాక్టర్స్తోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. తమ ప్రాణాలను సైతం లేక్కచేయకుండా.. కరోనా రోగులకు దగ్గరుండి మరీ సేవలు అందిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. రోగులే తమ పిల్లలుగా భావిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్న చల్లని దేవతలు. కరోనా బాధితులకు ఫ్లూయిడ్స్ అందించడం, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్ పెట్టడం వంటి అనేక సపర్యలు చేస్తున్నారు. కరోనా పోరులో సేవలు చేస్తూ.. వారిలో కొందరు ఈ మహమ్మారికి బలయ్యారు. అయిన ఏమాత్రం అధైర్య పడకుండా.. కోవిడ్ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. అటు డాక్టర్లకు, ఇటు రోగులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ స్వీయ రక్షణతోపాటు… బాధితులను కూడా రక్షించేందుకు పాటుపడుతున్నారు. ఇంతటి సేవ చేస్తూ.. ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కోంటూ.. వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి దూరంగా ఉంటూ ఈ కష...